*




జర్నలిస్టు సోదరుల్లారా.. సీనియర్ జర్నలిస్టులను అగౌరపర్చకండి.. అక్రిడిటేషన్ కార్డు వున్నవారంతా జర్నలిస్టులు కాదు*


చాలా మంది జర్నలిస్టులు *సీనియర్* అనే పదానికి గౌరవం లేకుండా వ్యవహరిస్తున్న తీరు చూసి *జర్నలిజం* అనే పదాన్ని కాపాడాలనే తపనతోనే ఇలా వ్రాస్తున్నాను. అసలు ఏ రంగంలోనైనా సీనియర్ అంటే ఏమిటి? ఆయా రంగాల్లో నిమగ్నమై కనీసం పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారు మాత్రమే సీనియర్లు గా పరిగణించబడతారనేది నా అభిప్రాయం. ముఖ్యంగా అక్రిడిటేషన్ కార్డు తీసుకున్న ప్రతి ఒక్కరు జర్నలిస్టుగా చెప్పుకుంటున్నారు అది ముమ్మాటికీ తప్పు, ఎందుకంటే ప్రతి రోజు వార్తా సేకరణకు లేదా ఇన్వెష్టిగేషన్ కు తిరిగే వారే నిజమైన జర్నలిస్టులు. డబ్బులు పెట్టి కొనుక్కున్న అక్రిడిటేషన్ కార్డు ను అడ్డం పెట్టుకొని ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రభుత్వ, ప్రైవేట్ ఆఫీస్ లలో లేదా సొంత వ్యాపారం నిమిత్తం షాపుల్లో వుండే వారు (అడపాదడపా బయటకెళ్ళేవారు) జర్నలుస్టులు కానేకాదు. వారు స్వార్ధ ప్రయోజనాలకు మాత్రమే ఆ అక్రిడిటేషన్ కార్డులు పొందారు లేదా కొనుకున్నారు అని నిర్మోహమాటంగా చెప్పండి. ఉదయం నుండి సాయంత్రం వరకు వార్త సేకరణకు కాళ్ళరిగేలా తిరిగేవారే జర్నలుస్టులుగా చెప్పుకోండి. షాపుల్లో, ఆఫీసుల్లో కూర్చుండే వారు దయచేసి మీరు వ్యాపారాన్ని లేదా మీ ఉద్యోగాన్ని మీ పేరు పక్కన వ్రాసుకోండి అంతేగాని *జర్నలిస్టు* అని గాని *సీనియర్ జర్నలుస్టు* అని గాని దయచేసి వ్రాసుకోవద్దని మనవి. షాపుల్లో, ఆఫీసుల్లో పగలంతా గడుపుతూ ఏదో ఒక పేపర్ పేరు చెప్పుకొని ఒక వాట్సాప్ గ్ర్రూప్ నడుపుతున్న వారు కూడా జర్నలిస్టులు కాదు. నిత్యం వార్తా సేకరణకు పరితపిస్తూ పది సంవత్సరాలు సీనియారిటీ వున్న జర్నలిస్టులు మాత్రమే *సీనియర్ జర్నలిస్టులు* గా వ్రాసుకోండి, చెలామణికాండి. అంతేగాని వాట్సాప్ గ్రూప్ లు నిర్వహించే వారు ముమ్మాటికీ జర్నలిస్టు లు కాదు. 

మరీ ముఖ్యమగా ఒక విషయాన్ని ప్రతి జర్నలిస్టు గుర్తెరిగి తమ బాధ్యతను అలవర్చుకొని సమాజంలో సీనియర్ జర్నలుస్టులను గౌరవించాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఈ విషయం ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే ప్రెస్ మీట్ కార్యమాల్లో జూనియర్ జర్నలిస్టులు ముందుగా వారే ముందు వరుస సీట్లను ఆక్రమించుకోవడంతో సీనియర్ జర్నలిస్టులు వెనక సీట్లలో కూర్చునే పరిస్థితి ఏర్పడుతొంది. 
ఈ పద్దతి మంచిది కాదు సీనియర్లను గౌరవించి సీనియర్లు రాగానే ముందు వరుస సీటు సీనియర్ కు ఇవ్వాలని నా మనవి. ఈ పరిస్థితిని గమనించిన కొందరు సీనియర్లు బయటనే వేచి వుంటున్నామని, ఇంకొందరు తప్పదు ఎన్నిసార్లు  చెప్పినా అర్ధం చేసుకోరు అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. 

చివరగా షాపుల్లో, ఉద్యోగాల్లో బిజీగా వుండే వాళ్ళు దయచేసి జర్నలుస్టు గా చెప్పుకోవద్దు మరీ ముఖ్యంగా అలాంటి వారు సీనియర్ జర్నలిస్టు అని ఎట్టిపరిస్థితుల్లోను వ్రాసుకోవద్దు. అక్రిడిటేషన్ కార్డు లేకపోయినా వార్తా సేకరణకు పరితపించేవారు జర్నిస్టుగా చెప్పుకోండి మరి పది సంవత్సరాలుగా ఇదే వృత్తిలో వున్నవారు సీనియర్ జర్నలిస్టు (అక్రిడిటేషన్ కార్డు లేకున్నా) గా చెప్పుకోండి, వ్రాసుకోండి. ఇకనైనా మారండి.. వార్తా సేకరణకు నిత్యం పరితపిస్తున్న నిజమైన జర్నలిస్టులను గౌరవించాల్సిందిగా అక్రిడిటేషన్ పొందిన వ్యాపారస్తులను, ఉద్యోగస్తులను కోరుతున్నాను.

*నాయిని శ్రీనివాసరావు- సీనియర్ జర్నలిస్ట్,* 
సెల్: 9290 999 316,
        9490 999 316.

Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: