మారువేషంలో అనంతపురం జిల్లా కలెక్టర్.. గుంతకల్లు ప్రభుత్వ ఆస్పత్రిలో తనిఖీలు
..!!


: అనంతపురం జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న వినోద్ కుమార్ మారువేషంలో జిల్లాలో పర్యటించారు. ప్రజల సమస్యలను తెలుసుకునే ప్రయత్నంలో భాగంగానే ఆయన ఈ పని చేశారు.


ప్రజాసేవకు నూతన మార్గంగా జిల్లా కలెక్టర్ తీసుకున్న చర్యలతో.. అనంతపురం జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే, తాజాగా, కలెక్టర్ వినోద్ కుమార్ మారువేషంలో గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో అర్థరాత్రి తనిఖీలు చేశారు.


అయితే, జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ సామాన్యుడిలా గుంతకల్ ప్రభుత్వ ఆసుపత్రిలో కలియతిరుగుతూ.. రోగుల యొక్క సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ముఖానికి మాస్క్, మెడలో టవల్ కప్పుకుని ప్రభుత్వ ఆసుపత్రి మొత్తాన్నీ పరిశీలించారు. ఆసుపత్రి బయట చెప్పులు విడిచి వెళ్లి.. రోగులు, ప్రభుత్వాసుపత్రి సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు కలెక్టర్ వినోద్ కుమార్.


Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: