*స్ట్రాంగ్ రూము నలుమూలల పటిష్ఠ భద్రత*.
*నిరంతరం అప్రమత్తంగా గార్డు విధులు*.
*వేకుజామున స్ట్రాంగ్ రూము భద్రతను అక్ష్మకంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ జి. ఆర్.రాధిక*.
*జిల్లా ఎస్పీ జి.ఆర్.రాధిక, ఐపిఎస్ శుక్రవారం వేకువజామున శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల శ్రీ శివాని ఇంజనీరింగ్ కళాశాలను సందర్శించి, ఈవీఎం లను భద్రపరిచిన స్ట్రాంగ్ రూం భద్రత,సీసీ కెమెరాలు ద్వారా నిఘాను పర్యవేక్షించారు*.
శ్రీకాకుళం:31:ఈ క్రమంలో జిల్లా ఎస్పీ గారు కేంద్ర బలగాలు ఆర్మ్డ్,సివిల్ సిబ్బంది నిర్వహిస్తున్న గార్డు ప్రహారా సరళని పరిశీలించి గార్డు రిజిస్టర్లును తనిఖీ చేశారు.
కౌంటింగ్ తేదీ సమీపిస్తున్న వేళ మరింత అప్రమత్తంగా విధులు నిర్వహించాలన్నారు.
స్ట్రాంగ్ రూముల సీలింగ్, పరిసర ప్రాంతాలను పరిశీలించారు.
స్ట్రాంగ్ రూము పరిసర ప్రాంతాల రెండు కిలోమీటర్ల వరకు రెడ్ జోన్ గా ప్రకటించడం జరిగిందని డ్రోన్స్ కెమెరాలను ఎగరవేయటకు అనుమతి లేదుని అట్టి విషయాలు ఏమైనా ఉన్నా వెంటనే అధికారులకు తెలియజేయాలని సిబ్బందికి సూచించారు.అదేవిధంగా అనుమతి లేని ఇతర వ్యక్తులు ప్రవేశ మార్గాలు ద్వారా లోపలికి అనుమతించరాదని సూచించారు.
గార్డు సిబ్బంది వివారాలపై ఆరా తీసీ,నిరంతరం నిర్లక్ష్యం లేకుండా అప్రమత్తతో గార్డు విధులు నిర్వహించాలని సూచించి,స్ట్రాంగ్ రూమ్ భద్రత పరమైన అంశాలపై గార్డు సిబ్బందికు పలు అంశాలు పై దిశ నిర్దేశాలు చేశారు.
Post A Comment:
0 comments: