ఉచిత ఇసుక పాలసీతో ఊపందుకోనున్న నిర్మాణరంగం 
* *నెరవేరనున్న పేదల సొంతింటి కల* 
* *రాష్ట్ర ప్రగతికి బాటలు వేయనున్న ప్రభుత్వ నిర్ణయం*
* *గతంలో జగన్ ప్రభుత్వం ఇసుక మాఫియాతో కోట్లు కొల్లగొట్టింది*
* ‌మీడియాతో *చీరాల  ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య* 
చీరాల  : 
తమ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత ఇసుక పాలసీతో రాష్ట్రంలో నిర్మాణరంగం ఊపందుకుంటుందని ఇది రాష్ట్ర ప్రగతికి బాటలు వేస్తుందని *చీరాల  ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య* అన్నారు. ఉచిత ఇసుక అందుబాటులోకి రావడంతో పేదల సొంతింటి కలనెరవేరుతుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నెలరోజులలోపే అమలులోకి తెచ్చారని సంతోషం వ్యక్తం చేశారు. ఉచిత ఇసుక పాలసీ పక్కాగా అమలు చేస్తూ జీవో నెంబర్ 43 అమలు చేయడంతో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి, రాష్ట్ర ప్రగతికి బాటలు వేస్తుందన్నారు. నాణ్యమైన ఇసుక ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నది తెలుగుదేశం విధానమని, పారదర్శకత, ముందుచూపుతో ఈ పాలసీ రూపొందించడం జరిగిందని ఎమ్మెల్యే చెప్పారు. ఈ నిర్ణయంతో సామాన్యులకు భారీ ఊరట లభించిందని దీంతో తమ ప్రభుత్వాన్ని అన్ని వర్గాల ప్రజలు అభినందిస్తున్నారని పేర్కొన్నారు. ఎందుకంటే 
గత జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇసుక‌ మాఫియా నడిపి కోట్లు కొల్లగొట్టిందని, వైసీపీ నేతలే ఇసుకాసుర అవతారం ఎత్తి రూ.50 వేల కోట్లకు పైగా కొల్లగొట్టారని విమర్శించారు. జగన్ ప్రభుత్వం ఇసుక కృత్రిమ కొరత సృష్టించి ప్రజలను ఇబ్బందులకు గురి చేసిందని దీంతో నిర్మాణరంగం కుదేలైందని మండిపడ్డారు. జగన్ పాలనలో పేదలు ఇల్లు కట్టుకోడానికి రూ.5 లక్షలు ఖర్చు చేస్తే అందులో ఇసుక కొనడానికే రూ.3 లక్షలు ఖర్చు పెట్టాల్సిన దుస్థితి ఉండేదని గుర్తు చేశారు. గృహ నిర్మాణ శాఖకు సరఫరాల పేరుతో 98 లక్షల టన్నుల ఇసుకను జగన్ అండ్ కో మింగేసిందని ధ్వజమెత్తారు. జగన్ బినామీ సంస్థ జేపీ వెంచర్స్ చెల్లించాల్సిన మొత్తం నుంచి రూ. 800 కోట్లు మినహాయించి ప్రజాధనాన్ని ధారాదత్తం చేశారని విమర్శించారు. గత ఐదేళ్ళలో వైసీపీ నేతలు మింగేసిన ఇసుకతో సుమారు పది లక్షలకు పైగా ఇళ్ళు కట్టొచ్చంటే వారు ఏ స్థాయిలో అవినీతి చేశారో అర్థం చేసుకోవచ్చని ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య  వ్యాఖ్యానించారు. ఇలాంటి అక్రమ తవ్వకాలకు, అవినీతికి తావులేకుండా, రాష్ట్ర ప్రజల ప్రగతే ధ్యేయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సారధ్యంలోని తమ ప్రభుత్వం ఈ పాలసీ రూపొందించిందని, దీనిపై నిరంతరం విజిలెన్స్ పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. సుప్రీం కోర్టు, హైకోర్టు, ఎన్జీటీ నిబంధనలకు అనుగుణంగా పర్యవరణ పరిరక్షణకు నష్టం కలగకుండా ఉచిత ఇసుకను అందిస్తామని స్పష్టం చేశారు. జిల్లా స్థాయిలో శాండ్ కమిటీలు ఏర్పాటు చేసి కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఆర్డీవోలు, మైనింగ్ అధీఇకారులు ఎక్కడికక్కడ పర్యవేక్షిస్తారని ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య  వివరించారు.
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: